Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విస్తృతంగా తనిఖీలు చేయాలివిస్తతంగా తనిఖీలు
- నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్
నవతెలంగాణ-ఖమ్మం
సమాజాన్ని పీడించే గంజాయి స్మగ్లర్స్ మూలాలను పసిగట్టి అక్రమ రవాణాను కట్టడి చేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. సోమవారం జరిగిన నేర సమీక్ష సమావేశం స్పెషల్ బ్రాంచ్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. సమావేశం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ...గంజాయి సరఫరా అనేది తీవ్రమైన సమస్యగా గుర్తించి అన్ని స్థాయిల పోలీస్ అధికారులు మరింత బాధ్యతాయుతంగా, సమర్ధంగా పని చేయాలన్నారు. ఎక్కడ గంజాయి అమ్మకాలు చేసిన, సేవించనా సమాచారం తెలుసుకునేలా గ్రామీణ, పట్టణ ప్రజలతో మమేకం కావాలని అధికారులకు సూచించారు. గంజాయి సరఫరా, ఉత్పత్తి మరియు వినియోగించే వారి సమాచారం సేకరించలేకపోతే సంబంధిత ఎస్హెచ్వోలపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడం కోసం ప్రతి పోలీస్ స్టేషన్ల పరిధిలో పాన్ షాపులు, కిరాణా దుకాణాల తనిఖీతో పాటు వారితో సమావేశం నిర్వహించి గంజాయి, మత్తు పదార్ధాల విక్రయాల కారణంగా ఎదురయ్యే అనర్ధాలు, చట్టపరంగా తీసుకునే చర్యల పట్ల అవగాహన కల్పించి వారిని చైతన్యం చేయాలన్నారు. గంజాయి విషయంలో సమర్ధవంతంగా పనిచేసే అధికారులకు ప్రభుత్వం పలు రకాల ప్రోత్సాహకాలు ప్రకటించిందని, పదోన్నతులతో పాటు పతకాలు, నగదు ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు.కార్యక్రమంలో డీసీపీ ఇంజరాపు పూజ, అడిషనల్ డీసీపీ లాండ్ ఆర్డర్ సుభాష్ చంద్రబోస్, అడిషనల్ డీసీపీ కె.ప్రసాద్, అడిషనల్ డీసీపీ (ఏఆర్) కుమారస్వామి, ఏఎస్ఐ స్నేహ మెహ్రా, ఏసీపీలు రామోజీ రమేష్, ఆంజనేయులు, బస్వారెడ్డి, వెంకటేశ్, ప్రసన్నకుమార్, జహాంగీర్, రామనుజం, సంపత్ కుమార్, విజయబాబు, సిఐలు ఎస్సైలు పాల్గొన్నారు.