Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మంకార్పొరేషన్
ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశం సుందరయ్య భవనంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థులకు హాస్టల్లో అడ్మిషన్ ఇవ్వకుండా విద్యార్థులను ప్రభుత్వ జూనియర్ కళాశాలకు దూరం చేస్తున్నారని ఆవేదన చెందారు. విద్యార్థులకు ఎగ్జామ్స్ నిర్వహిస్తున్న తరుణంలో హాల్ టికెట్ ఉన్నా హాస్టల్లో అడ్మిషన్ లేకపోవడం వల్ల దూరప్రాంతాల నుంచి పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థులకు ప్రభుత్వం హాస్టల్ సదుపాయం కల్పించి లేకపోవడం నిరుపేద విద్యార్థులు చదువులకు దూరం చేయడమేనని ఆయన అన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎగ్జామ్స్ నిర్వహిస్తుందన్నారు. ఖాళీగా ఉన్న లెక్చరర్, గెస్ట్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేయకుండా ఎగ్జామ్స్ నిర్వహించడానికి ఫ్యాకల్టీ లేకుండా ప్రభుత్వం ఈ ఎగ్జామ్స్ నిర్వహిస్తుందని అన్నారు. వెంటనే జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 69 లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ మాస్ కాపీయింగ్‌కు పాల్పడే పరీక్షా కేంద్రాల పైన చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు మధు, జిల్లా గర్ల్స్ కో కన్వీనర్ సంగీత, జిల్లా నాయకులు ప్రవీణ్ కుమార్, రాజేష్, సుధాకర్, సాయి తదితరులు పాల్గొన్నారు.