Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద గల తమ్మినేని సుబ్బయ్య భవన్లో సోమవారం సిపిఎం మండల కమిటీ సమావేశం మండల నాయకులు సిలివేరు బాబు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో బండి రమేష్ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను విమర్శించారు.పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల వల్ల నిత్యావసర వస్తువులపై ప్రభావం పడి పేద, మధ్య తరగతి ప్రజలు జీవనం సాగించడం చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు. ఇప్పటికైనా మోడీ తన తప్పు తెలుసుకొని పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యమాలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు, యువత సమాయత్తం కావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు తుమ్మల శ్రీనివాసరావు, మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, ఉరడీ సుదర్శన్‌రెడ్డి, తోట పెద్ద వెంకటరెడ్డి, నందిగామ కృష్ణ, ఏటుకూరి ప్రసాద్, పద్మ, పెండ్యాల సుమతి, గాయత్రి, యర్రా నరసింహారావు, యామిని ఉపేందర్, తాటి వెంకటేశ్వర్లు, ధనియాకుల రామయ్య, రంజాన్, సాల్వే వెంకటేశ్వర్లు, వడ్లమూడి నాగేశ్వరరావు, మెడికొండ నాగేశ్వరరావు, నాగేశ్వరరావు, గోగుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.