Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వైరాటౌన్
కార్పొరేట్ సంస్థలు, బడా పెట్టుబడిదారుల లాబాల కోసం రైతులు, కార్మికులు, దళితులు, మహిళలు, బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవితాలను సర్వ నాశనం చేస్తున్న నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించడం ద్వారా దేశాన్ని కాపాడాలని సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు కోరారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) వైరా రూరల్ మండలం 8వ మహాసభ వైరా మండలం గోళ్ళేనపాడు గ్రామంలో సోమవారం అమరజీవి కామ్రేడ్ నర్వనేని సత్యనారాయణ నగర్ నందు అమరజీవి కామ్రేడ్ బుంగా కృష్ణ ప్రాంగణంలో జరిగింది. మహాసభ ప్రారంభ సూచకంగా సిపిఐ (ఎం) జెండాను పార్టీ సీనియర్ నాయకులు కోణిదేణ కోటేశ్వరరావు ఎగురవేశారు. అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పార్టీ సీనియర్ నాయకులు పారుపల్లి కృష్ణారావు, గాలి అరుణ, యస్.కే మజీద్ అధ్యక్షతన జరిగిన మహాసభలో జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వలన వ్యవసాయరంగం దివాళాతీసి ఆహార భద్రత సమస్య వస్తుందని, రైతులు ఉపాధిని కోల్పోయి రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ 11 నెలలుగా రైతులు ఉద్యమం చేస్తూ సుమారు 100మంది రైతులు చనిపోయిన మోడీ పట్టించుకోకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విద్యుత్ సంస్కరణల వలన దేశంలో చీకటి రోజులు వస్తాయని, పోరాడి సాధించుకున్న కార్మికుల చట్టాలకు నిర్వీర్యం చేసి కార్మికుల హక్కులను హరిస్తున్నారని, పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితె నిధులు, నీల్లు, నియామకాలు వస్తాయని ప్రజలను నమ్మించి రేండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలో పూర్తిగా విఫల చెందాడని అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకుండా నిరుద్యోగులకు మొండి చేయి చూపించాడని, పాత హామీలను నెరవేర్చకుండా ఎన్నికల కోసం కొత్త హామీలు ఇస్తూ మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారని విమర్శించారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు బొంతు రాంబాబు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను, చేస్తున్న మోసాలను పార్టీ శ్రేణులు అర్థంచేసుకుని సరైన టైంలో సారైన గుణపాఠం చెప్పాలని అన్నారు. అనంతరం 18మంది సభ్యులతో నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కార్యదర్శిగా తోట నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహాసభలో జిల్లా కమిటీ సభ్యులు, పారుపల్లి ఝాన్సి, వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, ఎంపీటీసీ కిలారు లక్ష్మి, విసి సత్యనారాయణ, కిలారు శ్రీనివాసరావు, తూము సుధాకర్, మాగంటి తిరుమలరావు, బాజోజు రమణ, బానాల శ్రీనివాసరావు, నల్లమోతు వెంకటనారాయణ, షేక్. షహానాబీ, జర్రిపోతుల పుష్పరాజ్యం, ద్రోనాదుల నాగేశ్వరరావు, షేక్. జానిమియా, చిత్తారు నాగరాజు, శీలం విష్ణువర్ధన్ రెడ్డి, కారుమంచి జయరాజు, మద్దెల బాబురావు, అమరనేని వేంకటేశ్వరరావు, గుడిమెట్ల మోహన్ రావు పాల్గొన్నారు.