Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూలూరుపాడు
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు ఆదరణను చూరగొంటున్నాయి. అడవి బిడ్డలు వీటి బాట పడుతున్నారు. నిరుపేద విద్యార్థులకు అత్యుత్త విద్యను అందించడమే లక్ష్యంతో ఐటీడీఏ వడివడిగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా జూలూరుపాడు మండల పరిధిలోని పడమట నర్సాపురంలో జరిగిన గ్రామ సభలో సర్పంచ్ కె మోహన్ రావు మాట్లాడుతూ గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాలలో ఉచిత ప్రవేశాలు జరుగుతున్న నేపథ్యంలో గిరిజనులు తమ పిల్లలకు ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఖాజా శ్రీను, ప్రధానోపాధ్యాయులు పి రమేష్, వార్డెన్ తారాదేవి, వెంకటేశ్వర్లు, వెంకటరమణ, సుభద్ర, విజయ కుమారి, జ్యోతి, రాము,హరిరాము హరిజన్ నెహ్రూ, నాగేశ్వరరావు పాల్గొన్నారు.