Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ భూపేందర్, బి వీరభద్రం
నవతెలంగాణ-భద్రాచలం
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలం ఐటిడిఎ ఏపీఓ డేవిడ్ రాజ్ కు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సండ్ర భూపేందర్, బి వీరభద్రం లు మాట్లాడుతూ నూతనంగా హాస్టళ్లలో చేరే ఇంటర్మీడియట్ విద్యార్థులకు హాస్టల్లో అడ్మిషన్ ఇవ్వకుండా విద్యార్థులను ప్రభుత్వం చదువులకు దూరం చేస్తుందనీ అన్నారు. విద్యార్థులకు ఎగ్జామ్స్ నిర్వహిస్తున్న తరుణంలో హాల్ టికెట్ ఉన్నా హాస్టల్ లో అడ్మిషన్ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఖాళీగా ఉన్న లెక్చరర్, గెస్ట్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేయకుండా ఎగ్జామ్స్ ఎలా నిర్వహిస్తారని, ఫ్యాకల్టీ లేకుండా సిలబస్ ఎలా పూర్తి చేశారనీ, బోర్డును ప్రశ్నించారు. వెంటనే జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.