Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
మండల పరిధిలోని తొట్టిపంపు గ్రామ శివారులో టిప్పర్ ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. సత్తుపల్లి యన్.టి.ఆర్ కాలానికి చెందిన మెడ రాజు(23) పాల్వంచ ఓ వివాహ వేడుకకు వెళ్లి స్వగ్రామం వెళుతుండగా తొట్టిపంపు గ్రామ శివారు దగ్గర రాగ మాధారం నుండి అన్నపురెడ్డిపల్లి వైపు వస్తున్న టిప్పర్ ఢ కొట్టడంతో రాజు అక్కడక్కడే మృతి చెందాడు. సంఘటన గురించి తెలుసుకున్న స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.