Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
శ్రీ సీతారామచంద్ర స్వామి భద్రాచలం వారి ఆధ్వర్యంలో జరిగే వివిధ ఉత్సవాలలో ఆదివాసులకి ప్రాధాన్యత కల్పించాలని ఆదివాసి కొండరెడ్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి కొండరెడ్ల సంఘం వ్యవస్తాపక గౌరవ అధ్యక్షులు ముర్ల రమేష్ మాట్లాడుతూ ఇప్పటికి దేవస్థానం ఆధ్వర్యంలో అపరభక్తులు పోకల దమ్మక్క , శబరి వారసులైన కొండరెడ్డి, కోయ, నాయకపోడు జాతులతో దమ్మక్క, శబరి స్మృతియాత్రలు జరిపిస్తున్నారని ఆయన అన్నారు.ఈ ఉత్సవాలను ఈ సంవత్సరం తూ తూ మంత్రంగా జరిపారని ఆయన అన్నారు. కేవలం దమ్మక్క, శబరి ఉత్సవాలలోనే ఆదివాసులని ఆహ్వానించటంకాదని, ప్రతిసంవత్సరం జరిగే శ్రీ రామనవమి, పట్టాభిషేకం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలలో కూడా స్థానిక ఆదివాసులైన కొండరెడ్డి, కోయ, నాయకపోడు జాతులకు కూడా ప్రాధాన్యత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిప్పల కొమ్మిరెడ్డి, భద్రారెడ్డి, నాగిరెడ్డి, దుర్గారెడ్డి, బాబురెడ్డి, మంగిరెడ్డి, యశోద, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.