Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
మండల సీపీఐ(ఎం) కార్యాలయంలో సోమవారం పార్టీ 8వ మహాసభ పిల్లి నాయుడు కొప్పుల శ్రీనివాసరావు, కోరం దుర్గ ఆధ్వర్యంలో జరిగింది. తొలుత ఎండ్రాతి అప్పారావు జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య, జిల్లా సెక్రెటరీ నెంబర్ కొక్కెరపాటి పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్, సీనియర్ నాయకులు మోరంపూడి పుల్లారావు మాట్లాడుతూ దేశంలో నరేంద్రమోడీ ప్రభుత్వం నియంతృత్వంగా పారిపాలన చేస్తుందని పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలని ఢిల్లీలో 11 నెలలుగా రైతు ఉద్యమం చేస్తుంటే చీమకుట్టినట్లు కూడా లేదని ఆయన అన్నారు. పోడు వ్యవసాయదారుల అందరికీ షరతులతో కాకుండా పట్టా హక్కు పత్రాలు ఇవ్వాలని పోడు రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మోరంపూడి పుల్లారావు, మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు, దొడ్డ లకిëనారాయణ పిల్లి నాయుడు పాల్గొన్నారు.