Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
అధికారులు ప్రతి శుక్రవారం మండలం పర్యటనల్లో గుర్తించిన సమస్యలు, పరిష్కారంపై నివేదికలు అందచేయాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శుక్రవారం మండల ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన మండలాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించి, నోట్ క్యామ్ యాప్ ద్వారా తీసిన ఫొటోలను పంపాలని చెప్పారు. అధికారుల పర్యటనలకు సంబంధించిన హాజరు వివరాలను అందచేయాలని డీపీఓకు సూచించారు. గైర్హాజరైన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షణ చేసేందుకు ప్రత్యేక అధికారులుగా జిల్లా అధికారులను నియమించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమస్య పరిష్కరించాలని ప్రజలు అందచేసిన వినతులను సంబంధిత అధికారులకు అండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, డిఆర్ఓ అశోక్ చక్రవర్తి, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, సీఇఓ విద్యాలత, డిపిఓ రమాకాంత్, ఆర్అండ్బి ఈఈ భీంమ్లా, డిఎస్ఓ చంద్రప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌ను విజయవంతం చేయండీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా చేపట్టిన స్కూల్ ఇన్నో వేషన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్-2021 పోస్టర్‌ను కలెక్టర్ అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాఠశాల విద్య, తెలంగాణ రాఊ ఇనోంనవేషన్ సెల్, యూనిసెఫ్, ఇంక్విలాబ్ పౌండేషన్ సంయుక్తంగా పాఠశాల విద్యార్థులను స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2021 కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని తెలిపారు. గత ఏడాది జిల్లా నుండి ఉత్తమ ప్రాజెక్టుల్లో జెడ్పిపిఎస్ మల్లెలమడుగు ఎంపిక కావడం హర్షనీయమన్నారు. ప్రతిపాఠశాల నుండి అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. నూతన అవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని కోరారు.ఈనెల 26వ తేదీతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ సరస్వతీ చలపతి రాజు, ఎసీఇ రామేశ్వరరావు, ఎంఇఓ జుంకీలాల్ తదితరులు పాల్గొన్నారు.
బ్యాంకులు అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు అందించే రుణాలను సద్వినియోగం చేసుకుని ప్రజలు ఆర్థికాభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తెలిపారు. సోమవారం కొత్తగూడెం క్లబ్లో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు నిర్వహించిన రుణ మేళా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో రుణ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు. 25 మహిళ స్వయం సంఘాలకు రూ.2.50 కోట్ల రుణాల చెక్కును జిల్లా కలెక్టర్ పంపిణీ చేసి రుణ చెల్లింపు ప్రక్రియను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ భారతీయ స్టేట్ బ్యాంక్ డిజియం బాలానంద్, ఎస్బిఐ బ్యాంక్ రీజినల్ మేనేజర్ కె. మహేశ్వర్, లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు, మత్స్య శాఖ అధికారి వరదారెడ్డి, ఏవిజిబివి రీజినల్ మేనేజర్ శ్రీకాంత్, నాబర్డ్ డిడిఎం సుజిత్ కుమార్, జిఎండిఐసీ సీతారాం నాయక్ మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు