Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
అన్ని రంగాలను ప్రవేయిటీకరించి దేశాన్ని ఆధోగతిపాలు చేస్తున్న ప్రధాని మోడీ ఒక్క రోజు కూడా కొనసాగే హక్కు లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు అన్నారు. స్దానిక వినోబాభావే కాలనీలో సోమవారం 7వ మండల మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మోడీ 7 ఏండ్ల పాలనలో దేశ ప్రజలకు ఒరింగిందేమిలేదన్నారు. 2020 మార్చి 22 నుండి 2 నెలపాటు లాక్డౌన్ ప్రకటించి ఎవరూ బయటకు రాని సమయంలో కార్పోరేట్ దిగ్గాజాలతో సమావేశమై ఎవరికి ఏది కావాలో అది ఇచ్చేపని చేశారని విమర్శించారు. 26,700 రహదారులను ప్రయివేటకు కట్టబెట్టారని అన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధన్నాన్ని తెచ్చి ఒక్కొక్కరి ఎకౌంట్లో రూ.15లక్షలు వేస్తామని 2014 ఎన్నికల్లో ఇచ్చి హామీ అటకెక్కించారని అన్నారు. కరోనా సమయంలో ప్రజలకు ఆర్దిక సహాయం చేయకుండా ఇబ్బందులకు గురిచేశారని అన్నారు.
ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకుంటున్న తెలంగాణ సిఎం
ఏ రకమైన ఎన్నికలు వచ్చినా ఆ సమయాల్లో కొత్తకొత్త పథకాలు తేవడం, ఏ శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో లెక్క చూడండని అధికారులకు ఆదేశాలివ్వడం, ప్రజలకు, నిరుద్యోగులకు భ్రమలు కలిగించడం సిఎం కేసిఆర్ నైజం అన్నారు. కేసిఆర్ పట్ల ప్రజలకు నమ్మకం సడలుతోందన్నారు. వేల ఎకరాలు ఉన్న ఆసాములకు, ఒక ఎకరం ఉన్న రైతుకు రైతు బంధు ఇవ్వడం అంటె ఎవరి మేలుకోసమో ప్రజలకు ఆర్ధమౌతోందన్నారు. హుజురాబాద్లో దళితులకు రూ.10లక్షలు ప్రకటిస్తే ఇల్లందు దళితులకు ఎందుకు ప్రకటించరని ప్రశ్నించారు. కేంద్రం తెచ్చిన రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలు,మతోన్మాదంపై సిఎం కేసిఆర్ నోరు మెదపడంలేదని అన్నారు. ఈ పరిస్థితులను సిపిఎం గమనిస్తోందన్నారు. బిజేపి, టిఆర్ఎస్ ఒకే నాణానికి ఉన్న బొమ్మబొరుసు లాంటివన్నారు.
సీపీఐ(ఎం)కు అధికారం ఇస్తే ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటాం
ఆపదలో ఆదుకునేది కమ్యూనిస్టులేనని ప్రజలకు బంధువులు కూడా వారేనని పోతినేని అన్నారు. ప్రపంచ వ్యాపితంగా కరోన విలయతాండం చేసిన రోజుల్లో కమ్యూనిస్టు దేశాలైన చైనా, ఉత్తరకొరియా, వియత్నాం, లావోస్, క్యూబా తదితర అనేక దేశాల్లో ప్రజలను కాపాడుకోవడానికి యుద్ధ ప్రాతిపతికన చర్యలు చేపట్టి అదుపుచేసి ఆదుకున్నారని అన్నారు. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు కరోనాతో విలవిలాడితే చాలా చిన్న దేశం అయిన కమ్యూనిస్తు క్యూబా డాక్టర్లు సేవలు చేశారని గుర్తు చేశారు. భారత దేశంలో కరోన విలయతాండం చేస్తే మరణాలు సంభవిస్తుంటె ఏమిలేదని అంతా బాగుందని ప్రధాని మోడి ప్రచార సాధనాల ద్వార ప్రచారం చేసుకున్నారని అన్నారు. ప్రపంచ మీడియా వచ్చి అసలు నిజాలు బయట ప్రపంచానికి తెలిపాయన్నారు. 5కేజీలు బియ్యం కేజి కందిపప్పు ఇచ్చి చేతులు దులుపుకొందన్నారు. కేరళలో సిపిఎం అధికారంలో ఉన్నందువల్ల ప్రజలకు సేవ చేసే భాగ్యం లభించిందన్నారు. 18 రకాల సరుకులు అందించి గ్రామ స్దాయి నుండి మెరుగైన వైద్యం అందింది ప్రజల ప్రాణాలు కాపాడామని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ సైతం ప్రశంసలు కురిపించిందన్నారు. అందుకే ప్రజలు కమ్యూనిస్టులను ఆదరించాలన్నారు. తెలంగాణలో ప్రజలు సిపిఎంకు అధికార మిస్తే కన్న బిడ్డల్లా చూసుకుంటామన్నారు. ప్రజలకు వెన్నంటి ఉండి సమస్యలపై పోరాటాలు చేస్తు ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటి సభ్యులు ఏజె రమేష్.జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గుగులోత్ ధర్మా, జిల్లా కమిటీ సభ్యులు నబి, సీనియర్ నాయకులు దేవులపల్లి యాకయ్య, కిరణ్, తాళ్ళూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మండల కార్యదర్శిగా అబ్దుల్ నబి
పట్టణంలోని వినోబాభావే నగర్లో సోమవారం సిపిఐ(ఎం) మండల 7వ మహాసభలు ఘనంగా నిర్వహించారు. మహాసభల ప్రాంగణానికి అమర వీరుల నగర్,తాండ్ర రాయపోష ప్రాంగణం అని నామకరణం చేశారు. సీనియర్ నాయకులు దేవులపల్లి యాకయ్య జెండావిష్కరించారు. అనంతరం అమర వీరుల స్ధూపానికి సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏజె.రమేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గుగులోత్ ధర్మా, జిల్లా కమిటీ సభ్యులు నబి,ఆలేటి కిరణ్, కృష్ణ తదితరులు నివాళులర్పించారు. మహాసభలకు అధ్యక్షవర్గంగా సుడిగాలి వెంకటనర్సయ్య, ఈసం వెంకటమ్మ,ఆలేటి సంధ్య, నబి, లక్ష్మి వ్యహరించారు. సభ ప్రారంభం కాగానే అమర వీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో కరికపల్లి రాయమల్లు,ఎస్.విజయకుమార్,ఆలేటి సంధ్య తదితరులు ఉర్రూతలూగించే అభ్యుదయ పాటలు పాడారు. అనంతరం జరిగిన మండల మహాసభలో మండల కార్యదర్శిగా అబ్దుల్ నబిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.