Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మణుగూరు : భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికుల పట్ల యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని టిఎస్పిఈయు 1535 రాష్ట్ర అధ్యక్షులు ఎం.వజీర్ ఆరోపించారు. మంగళవారం సిఈ బాలరాజుకు వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ బీటీపిఎస్లో కార్మికులకు ఇప్పటికి పూర్తి స్థాయిలో మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. కొన్ని విభాగాల్లో మంచినీరు కూడా లేక కొనుగోలు చేసుకోని తాగాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఉద్యోగులందరికి అంబులెన్స్ సౌకరాన్ని ఏర్పాటు చేయాలన్నారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో పిహెచ్సి ఏర్పాటు చేయాలని వేడుకున్నారు. కర్మాగారంలో క్యాంటీన్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. ఈ కర్మాగారంలో పనిచేస్తున్న జనసాంద్రత, షీఫ్ట్ అలవెన్స్ ఇవ్వాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, జెన్కో అధ్యక్షుడు రాము, కేంద్ర కమిటీ సభ్యులు శ్రీధర్, వెంకటేశ్వర్లు, రీజీయన్ అధ్యక్ష కార్యదర్శులు ప్రసాద్, ఎం.రాజమనోహార్, పాల్గొన్నారు.