Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మత్స్యశాఖ జిల్లా అధికారి వరదారెడ్డి
- పలు చెరువుల్లో వదిలిన 3.54 లక్షల చేప పిల్లలు
నవతెలంగాణ-ములకలపల్లి
తెలంగాణ ప్రభుత్వంలో మత్స్యకారులు అభివృద్ధి చెందడమే మత్స్యశాఖ లక్ష్యంగా పెట్టుకుందని జిల్లా మత్స్యశాఖ అధికారి వరదారెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మూకమామిడి ప్రాజెక్టుతో పాటు పూసుగూడెంలోని నల్లచెరువులో తెలంగాణ ప్రభుత్వం అందించిన 3.54 లక్షల చేపపిల్లలను జడ్పీటీసీ సున్నం నాగమణి, మత్స్యశాఖ సిబ్బంది చేతులమీదుగా వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం అందించిన చేపపిల్లలను మత్స్యశాఖ ద్వారా అందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపిటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, గిరిజన మత్స్య సంఘం మత్స్యశాఖ సిబ్బంది, పూసుగూడెం అధ్యక్షులు సున్నం రాజేశ్వరరావు, మూకమామిడి అధ్యక్షులు కీసర వెంకటేశ్వర్లు, మత్స్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.