Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతంలో బాలుడి తాతపై దాడి.. గుండె పోటుతో మృతి
నవతెలంగాణ-చండ్రుగొండ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో కోతుల బెడద రోజురోజుకు పెరిగి ప్రజలపై దాడులు చేసి ప్రాణాలు తీసే స్థాయికి చేరుకున్నాయి. మంగళవారం తిప్పనపల్లి గ్రామానికి చెందిన సయ్యద్ జోష్ మియా కుమారుడు రియాజ్ ఉదయం ఇంటి ఆవరణలో టూత్ బ్రష్ చేస్తున్న సమయంలో కోతుల మంద బాలుడి పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. వెంటనే కుటుంబ సభ్యులు కోతులను తరిమి ఆ బాలుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. నాలుగు నెలల క్రితం ఇదే బాలుడి తాత అయిన సయ్యద్ ఖాదర్ పై కోతి దాడి చేయడంతో ఒక్కసారిగా కేకలు వేయడంతో గుండె పట్టేసి అక్కడికక్కడే మరణించారు. ఇలా మండల వ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక చోట కోతుల దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా సంబంధిత శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికైనా కోతులను గ్రామాల్లో లేకుండా చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. పంట పొలాలను ధ్వంసం, మనుషులపై దాడి చేయకుండా ప్రభుత్వం పరిష్కార మార్గం చూపాలని మండల ప్రజలు కోరుతున్నారు .