Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పారిశుధ్యం లేమిపై ఆగ్రహం
నవతెలంగాణ-అశ్వారావుపేట
మండలంలోని నాలుగు పంచాయతీలలో జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) లక్ష్మీ రమాకాంత్ మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పంచాయతీలలోని పలు వీధుల్లో పారిశుధ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అభివృద్ధ్ది పనుల నిర్వహణా నమోదు రికార్డులను తనిఖీ చేసారు. అపరిశుభ్రత పై అధికారుల పై ఆగ్రహం వ్యక్తంచేశారు. పక్షం రోజులలో పారిశుద్యం పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. అశ్వారావుపేట, పేరాయగూడెం, నారంవారిగూడెం, వారంవారిగూడెం కాలనీ పంచాయతీలలో పారిశుధ్యం పనులతో పాటు, పల్లె ప్రకృతి వనాలు, స్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు పరిశీలించి వాటి పనితీరును మండల స్థాయి అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పంచాయతీలలో డ్రైనేజీ పారుదల అస్థవ్యస్థంగా ఉండటంపై పంచాయతీ కార్యదర్శులపై అసహనం వ్యక్తం చేశారు. మరో మూడు రోజులలో మళ్ళీ పర్యటిస్తానని అప్పటిలోగా పనులన్నీ పూర్తిచేయాలని కార్యదర్శులకు ఆదేశించారు. పేరాయగూడెం పంచాయతీలోని క్రిమిటోరియం వద్ద నీటి వసతిరి బోరు వేయించాలని అందుకు పాలకవర్గం సహకారం తీసుకోవాలని అన్నారు.రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేయాలని రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. విదుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈయన వెంట పంచాయతీ మండల అధికారి సీతారామరాజు, ఆయా పంచాయతీల కార్యదర్శులు గబవెల్లి హరికృష్ణు, కోటమర్తి శ్రీరామూర్మర్తి, బి.వెంకటేశ్వర్లు, ఉన్నారు.