Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
దమ్మపేట పట్టణంలోని అమరజీవి కామ్రేడ్ (మాజీ ఎమ్మెల్యే) సున్నం రాజయ్య నగర్, అమరజీవి కామ్రేడ్ (మాజీ ఎమ్మెల్యే)కుంజా బొజ్జి ప్రాంగణం ( సుందరయ్య భవనంలో) మండల కమిటీగా 13 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరిలో మోరంపూడి శ్రీనివాసరావు, పిల్లినాయుడు, దొడ్డా లకిëనారాయణ, రావుల శోభన్‌బాబు, మోరంపూడి కేశవరావు, కొప్పుల శ్రీనివాసరావు, పెనుబల్లి నానారావు, కూరం దుర్గ, సున్నం నానారావు, లింగారెడ్డి శివశంకర్, కొల్కిపోగు శ్రీనివాసరావు, భోగి నరసింహారావు, పిట్టల పోలమ్మలను ఎన్నుకున్నారు. ఈ సభ్యులందరూ మోరంపూడి శ్రీనివాసరావు పార్టీ బలోపేతం కోసం చేసిన కృషిని గుర్తించి మరోసారి ఆయనకే మండల కార్యదర్శిగా బాధ్యతలను అప్పగించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీసభ్యులు కాసాని ఐలయ్య, జిల్లా సెక్రటేరియేట్ మెంబర్ కొక్కెరపాటి పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్, జిల్లా సీనియర్ నాయకులు మోరంపూడి పుల్లారావు, యండ్రాతి అప్పారావు పాల్గొన్నారు.