Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్వీరామంగా సేవాలందిస్తున్న జేడీ ఫౌండేషన్ ఆక్సిజన్ బ్యాంక్
నవ తెలంగాణ-భద్రాచలం
భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలువురికి ఆక్సిజన్ అందించి ప్రాణాలను నిలుపుతున్న జే.డీ ఫౌండేషన్ ఆక్సిజన్ బ్యాంక్ మరొకసారి తమ గొప్ప మనసు చాటుకున్నారు. ఇప్పటికే ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు అందజేస్తున్న పౌండేషన్ మంగళవారం భద్రాచలం మెడికల్ కాలనీ కి చెందిన శెట్టి పద్మ (71 సంవత్సరాలు) శ్వాస ఇబ్బందులు ఎదురవడం తో అత్యవసర పరిస్థితిలో వారి కుటుంబసభ్యులు జే.డీ ఫౌండేషన్ ని సంప్రదించారు. తక్షణమే ఫౌండేషన్ సభ్యులు కడాలి నాగరాజు ద్వారా ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ ను వారి కుమారుడు కి అందజేశారు. పద్మ కుటుంబ సభ్యులు జే.డీ ఫౌండేషన్ భాద్యుడు మురళీమోహన్ కుమార్ కి, ఫౌండేషన్‌కి కృతజ్ఞతలు తెలిపారు.