Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాసం రోజుల తరువాత మళ్ళీ కరోనా
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
కరోనా అలజడి లేక నెలరోజులు గడుస్తున్న సమయంలో మళ్ళీ మంగళవారం మూడు పాజిటివ్ కేసులు రావడంతో మళ్ళీ మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. యర్రగుంట ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో గత నెల రోజులు నుండి ప్రతి రోజు సుమారు 65 మందికి పైగా కరోనా పరీక్షలు చేస్తున్న ఒక్కరికి కూడా పాజిటివ్ రాకపోవడంతో కరోనా ఇంకా రాదులే అనుకున్న సమయంలో మంగళవారం అబ్బుగూడెం గ్రామంలో 2, భీమునిగూడెం గ్రామంలో 1 పాజిటివ్ వచ్చినాయి. దీంతో ఆ గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతంలో అబ్బుగూడెం గ్రామంలో కరోనా వచ్చి మరణించిన వారు కూడా ఉన్నారు. ఇదే గ్రామం నుండి అనేక మంది విద్యార్థులు ప్రభుత్వ ప్రయివేట్ పాఠశాలకు ప్రతి రోజు బస్లో దూర ప్రాంతాలకు వెళ్ళి వస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులు కూడా మాస్క్ లేకుండా పాఠశాలకు పోవడం గ్రామాల్లో ప్రజలు మాస్క్ పెట్టడం, సామాజిక దూరం మరిచిపోవడం వేల సంఖ్యలో జన సమూహంతో కలసి ఫంక్షన్ లు, వివాహాలు తదితర కార్యక్రమాలు చేస్తున్న అధికారులు ఎవరు పట్టించుకోవకపోవడంతో మరల కరోనా విలయతాండవం చేస్తుందోనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.