Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వానికి లేదు.
- డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్రంలో ఖాళీ అయిన ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులను భర్తీ చేయడానికి ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగాల భర్తీ పైన నిరుద్యోగ సమస్యపై లేదని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ విమర్శించారు. మంగళవారం స్థానిక సంఘ కార్యాలయంలో హరికృష్ణ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు. యువకులు అంటే కేవలం ఎన్నికల్లో తమకు ఓట్లు వేసే ఓటర్లు గాని ప్రభుత్వాలు భావిస్తున్నాయని ఈ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే భవిష్యత్ తరాలు అనే విషయాన్ని మరిచి పోతున్నాయన్నారు. సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వ హామీ నేటికీ అమలు కాకపోగా నిరుద్యోగులను పకోడీ వేసుకోమని, కిళ్ళీకొట్టు నడుపుకోమని కేంద్ర మంత్రులు ఉచిత సలహాలు ఇస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. భవిష్యత్తులో నిరుద్యోగ సమస్యపై డివైఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టబోతుందని హెచ్చరించారు. నవంబర్ 1,2,3 తేదీల్లో డివైఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గ్రామ గ్రామాన జెండా ఆవిష్కరణ చేయాలని పిలుపు నిచ్చారు. గత 11 నెలలుగా ఢిల్లీలో రైతాంగం చేస్తున్న పోరాటానికి మద్దతుగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాలంగి హరికృష్ణ, లిక్కి బాలరాజు, ఉప్పెర్ల ప్రశాంత్, చందర్ రావు వెంకన్న, రాకేష్, వీరబాబు, కుమార్ తదతరులు పాల్గొన్నారు.
డీవైఎఫ్ఐ జిల్లా నూతన కమిటీ ఎన్నిక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీవైఎఫ్ఐ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. మంగళ వారం కొత్తగూడెం డివైఎఫ్ఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నూన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా కాలంగి హరి కృష్ణ, లిక్కి బాలరాజు ఎన్నికయ్యారు. నూతన కమిటీ ఎన్నిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.