Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
పోతినేని సుదర్శన్ రావు
నవతెలంగాణ-తల్లాడ
కేంద్ర ప్రభుత్వం గద్దె దిగి వరకూ వామపక్ష, ప్రజాతంత్ర శక్తులతో కలిసి ఐక్య పోరాటం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ అన్నారు. తల్లాడ వాసవి కళ్యాణ మండపంలో సీపీఐ(ఎం) మండల 8వ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ పాలనలో నోట్లు రద్దు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని గుర్తుచేశారు. కరోనా నియంత్రించడానికి, చప్పట్లు, పళ్ళాలు, దీపాలు వెలిగించడం, పూలు చల్లడం లాంటి పనులు పురమాయించి కార్పొరేట్ శక్తులకు లాభం కలిగేలా వ్యవహరించారు. ప్రజావ్యతిరేక, రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి, నడ్డివిరిచారని ఆరోపించారు. రోడ్లు, రైలు, రైల్వే స్టేషన్లు, విమానాలు, విమానాశ్రయం విక్రయిస్తూ, ఆదాని, అంబానీలకు మేలు చేస్తున్నారని విమర్శించారు. నల్ల చట్టాలు తీసుకువచ్చే రైతు కార్మిక హక్కులను హరిస్తున్నారని అన్నారు. కలిసివచ్చే ప్రజాస్వామ్య ప్రజాతంత్ర శక్తులతో బీజేపీ గద్దె దిగే వరకు పోరాడాలన్నారు.
ఎన్నికలు వస్తేనే కెసిఆర్ కు పథకాలు గుర్తుకొస్తాయి, ఓట్ల అనంతరం బుట్టదాఖలు చేస్తారని విమర్శించారు.
సాయంత్రం గ్లాసు ఎత్తితే ప్రతి గింజ కొంటాం అంటారు, గ్లాసు దించితే గింజ కొనేది లేదు ఉంటారని సీఎంను ఎద్దేవా చేశారు. హుజురాబాద్లో దళితులకు 10 లక్షల ప్రకటిస్తే మిగతా నియోజకవర్గాల్లో ఎందుకు ప్రకటించారని ప్రశ్నించారు. కేరళ రాష్ట్రంలో సిపిఎం అధికారంలో ఉన్నందువలన ప్రజలకు సేవ చేసే భాగ్యం లభించిందని అన్నారు. అందుకే ప్రజలు కమ్యూనిస్టులను ఆదరించాలన్నారు. ఈ మహాసభలో జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాచర్ల భారతి, కళ్యాణ వెంకటేశ్వర రావు, తాతా భాస్కరరావు, మండల కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి, మండల కమిటీ సభ్యులు నల్లమోతు మోహన్ రావు, రామలింగేశ్వరరవు, షేక్ మస్తాన్, నారాయణ రెడ్డి పాల్గొన్నారు.
తల్లాడ సీపీఐ(ఎం) మండల కార్యదర్శిగా అయినాల
తల్లాడ సీపీఐ(ఎం) మండల కార్యదర్శిగా అయినాల రామలింగేశ్వర రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రామ లింగేశ్వరరావు నవతెలంగాణ తో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడతామని, మండల ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కలిసి వచ్చే పార్టీలతో కలిసి పోరాడుతామన్నారు.