Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జి ఎం (పి.పి) కె.నాగభుషణ్ రెడ్డి
నవతెలంగాణ-ఇల్లందు
ఏరియాకు నిర్ధేశించిన ఉత్పత్తిని సాధించేలా ప్రణాళికతో పనిచేస్తూ లక్ష్యం సాధించాలని జిఎం (పి.పి) కె.నాగభుషణ్ రెడ్డి అధికారులను కోరారు. ఏరియాకు నిర్ధేశించిన బొగ్గు వార్షిక బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకతపై మంగళవారం వై.సి.ఓ.ఎ క్లబ్ లో ఏరియా జిఎం మల్లెల సుబ్బారావు అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. వార్షిక బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత టార్గెట్ కమిటీ కన్వీనర్ జి యం కార్పొరేట్ (పి.పి) కె.నాగభుషణ్ రెడ్డి మరియు జియం (క్వాలిటీ) కే.జి.ఎం.రీజన్ ఎ.రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఏరియా కు నిర్ధేశించిన ఉత్పత్తి ఉత్పాదకత లక్ష్యాలు వాటికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు అధికారులకు దృశ్య రూపకం ద్వారా టార్గెట్ కమిటీ వివరించింది. ఏరియా కు అవసరమయ్యే యంత్రాలు, పరికరాలు, విడిభాగాల, మ్యాన్ పవర్, పని స్థలాల తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జియం బండి వెంకటయ్య, ఎజిఎం జి.ప్రభాకరరావు, ఒసి ప్రాజెక్టు అధికారులు బొల్లం వెంకటేశ్వర్లు, మల్లారపు మల్లయ్య, ప్రాజెక్ట్ ఇంజనీర్ చెన్నయ్య, శివశంకర్, విభాగాదిపతులు గిరిధరరావు పాల్గొన్నారు.