Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిడిపిఓ నవ్యశ్రీ
నవతెలంగాణ- దుమ్ముగూడెం
ప్రతి ఒక్కరూ చిరుధాన్యాలతో తయారుచేసిన ఆహారం తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని దుమ్ముగూడెం ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిణి నవ్య శ్రీ అన్నారు. మంగళవారం దుమ్ముగూడెం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని పర్ణశాల సెక్టార్లో గల పెద్ద నల్లబెల్లి ప్రైమరీ స్కూల్ ఆవరణలో చిరుధాన్యాల ఆహార పండగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిరుధాన్యాల లో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయని ప్రతి ఒక్కరు పౌష్టిక విలువలు ఉన్న చిరుధాన్యాలతో వంటలు చేసుకుని తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం అని ఆమె తెలిపారు. పిల్లలకు చిరుధాన్యాలు చిన్నప్పటినుంచే అలవాటు చేయడం చాలా ఉత్తమమని అన్నారు. అంతేకాకుండా చిరుధాన్యాలతో పోషకాహార లోపాన్ని నివారించవచ్చు అని అన్నారు. పెద్ద నల్లవెల్లి ఉపసర్పంచ్ భూపతి మాట్లాడుతూ పాత పంటల ఆహారం చాలా ఆరోగ్యం అని అన్నారు. అంగన్వాడి టీచర్లు తయారుచేసిన రాగి జావ ,రాగి లడ్డు, కొర్ర కిచిడి, కొర్ర పెరుగన్నం, కొర్ర పులిహౌర,సామ పాయసం, జొన్న ఉప్మా, రాగి రొట్టె, రాగి పకోడీ, జొన్న రొట్టె ,కొర్ర ఇడ్లీ ప్రదర్శన నిర్వహించారు. తర్వాత చిరుధాన్యాలతో చేసిన వంటకాలను గర్భిణులు, బాలింతలు ,తల్లులు, గ్రామస్తులు, రైతులకు అందజేశారు. తర్వాత గ్రామస్తులతో ఫీడ్ బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు ధనలక్ష్మి, మాణిక్యమ్మ, సావిత్రి, ప్రైమరీ స్కూల్ టీచర్లు కన్నయ్య, నాగేశ్వరావు, రామారావు, వెంకటేశ్వర్లు, అంగన్వాడీ టీచర్లు గజలక్ష్మి, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.