Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు సోమయ్య
- పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణా తరగతులు
నవతెలంగాణ-కొత్తగూడెం
సమాజంలో రోజురోజుకీ పెరిగిపోతున్న అసమానతల పై ప్రతీ సీపీఎం కార్యకర్తలు తిరగబడాలని, అప్పుడే ప్రజలు చైతన్య వంతులై మంచి సమాజాన్ని నిర్మించే అవకాశం ఉంటుందనీ సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి. సోమయ్య అన్నారు. కొత్తగూడెం మంచికంటి భవన్లో మంగళవారం పట్టణ పార్టీ సభ్యులకు రాజకీయా శిక్షణా తరగతులు నిర్వహించారు. సీపీఎం పట్టణ కార్యదర్శి భూక్యా రమేష్ ప్రిన్సిపల్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా సోమయ్య 'పార్టీ విశిష్ఠత- నిర్మాణం' క్లాస్‌ను బోధిస్తు.. కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రను తెలుసుకోవడం వల్ల గత సమాజాల్లో దోపిడీపై పోరాటాలు నిర్వహించి విజయం సాధించారన్నారు. త్యాగాల ఫలితమే నేడు హక్కుల సాధననే అన్నారు. కమ్యునిస్ట్ సిద్ధాంతంను అందరూ లోతుగా అధ్యయనం చేయాలన్నారు. ధరల పెరుగుదల, విద్య, వైద్యం, వ్యాపారపరం అవడం. నిరుద్యోగ యువత పెరగడం, ఉద్యోగాలు లేక నిరుత్సాహం లో ప్రజలు ఉండటం. పేదలు, ధనికులు అనే తారతమ్యం ఎందుకు ఉందని అలోచనా కలిగి ఉండాలన్నారు. వీటికి పరిష్కారము కలగాలంటే ఒక్కటే మార్గమని, కమ్యునిజం సాధన వల్లనే పరిష్కారము దొరుకుతుందని అన్నారు. కమ్యూనిష్ట్నుగా బ్రతకాలని, అప్పుడే వాస్తవాలు తెలుస్తాయన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించి నిరంతరం అధ్యయనం పోరాటం ద్వారానే మంచి సమాజాన్ని నిర్మించగలమని అన్నారు. ఈ క్లాసులో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు లిక్కి బాలరాజు, పట్టణ నేతలు సందకూరి లక్ష్మి, డి.వీరన్న, జెబి.నాగరాజు, కర్ల వీరస్వామి, నందిపాటి రమేశ్, తదితరులు పాల్గొన్నారు.