Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- బోనకల్
క్రమశిక్షణ, మిలిటెంట్ పోరాటాల లక్షణాలు కలిగిన నాయకులుగా ప్రతి ఒక్కరూ ఎదగాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు అన్నారు. గోవిందా పురం ఎల్ గ్రామంలో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులకు సిపిఎం గోవిందాపురం గ్రామ కమిటీ కన్వీనర్ ఉమ్మనేని రవి వ్యవహరించారు. సిపిఎం పార్టీకి పార్టీ నిర్మాణం ఆయుధం లాంటిదన్నారు. పార్టీ నిర్మాణం కలిగిన నాయకుడుకి ప్రజా పోరాటాలు నిర్వహించగల సామర్థ్యం వస్తుందన్నారు. పార్టీ నిర్మాణం లేని కార్యకర్తలు, నాయకులు పార్టీ ప్రజా పోరాటాలలో రాణించలేరన్నారు. అందుకోసం పార్టీ సభ్యులందరూ ఉక్కు క్రమశిక్షణ కలిగిన నాయకులు, కార్యకర్తలలాగా ఎదిగిన అప్పుడే పార్టీ నిర్మాణం బల పడుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు నిర్వహించగలిగే శక్తి సామర్థ్యం వస్తుందన్నారు. ఎంత పెద్ద నాయకుడైనా నిర్మాణం తప్పితే అతనిపై పార్టీ తప్పనిసరిగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని తెలిపారు ముఖ్యమంత్రి పదవి అనుభవించి పార్టీ నిర్మాణం తప్పితే వేటు వేసిన చరిత్ర కూడా సిపిఎంకు ఉందన్నారు. ప్రపంచంలోనే కమ్యూనిస్టు పార్టీకి అందులో సిపిఎం ఎంతో విశిష్టత కలిగిన పార్టీ అని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బండారు రమేష్ అన్నారు. క్రమశిక్షణకు, నైతిక విలువలు మారుపేరుగా సిపిఎం ఉందన్నారు. ప్రతి పార్టీ సభ్యుడు పార్టీ యొక్క విశిష్టత తెలుసుకోవాలన్నారు. పార్టీ విశిష్టత తెలుసుకోకుండా పార్టీలో కొనసాగడం వల్ల ఉపయోగం ఏమీ లేదన్నారు. ఈ శిక్షణా తరగతులలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, సిపిఎం మండల కమిటీ సభ్యులు తుళ్లూరు రమేష్, నోముల పుల్లయ్య, గుడ్డూరి ఉమ, జొన్నలగడ్డ సునీత, కొమ్ము శ్రీనివాసరావు, ఏడు నూతన లక్ష్మణరావు, కొమ్మినేని నాగేశ్వరరావు, గుడిపూడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తూటికుంట్ల, లక్ష్మీపురం, గోవిందపరం ఎల్, గార్లపాడు, రామాపురం గ్రామాలకుకు చెందిన సిపిఎం సభ్యులకు శిక్షణా తరగతులు నిర్వహించారు.