Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
కరోనా కష్టకాలంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకుగాను రూ.1.23కోట్ల వ్యయంతో టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు గతంలో ఉమ్మడి జిల్లాలో ఆరు నియోజకవర్గాలకు అందజేసిన ఆరు అంబులెన్స్‌లో మధిర, వైరా ఆరోగ్య కేంద్రాలకు చెందిన రెండు అంబులెన్స్‌లు ఇకనుండి 108 అత్యవసర సేవల కింద నిరంతరం ప్రజాసేవలోకి రానున్నాయి. ఇప్పటిదాకా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1) ఖమ్మం-పాలేరు, 2) వైరా, 3) మధిర, 4) సత్తుపల్లి, 5) అశ్వారావుపేట, 6) కొత్తగూడెంలలో ఈ ప్రత్యేక అంబులెన్స్‌లు సేవలు అందిస్తున్నాయి. నేటి నుండి ఈ అంబులెన్స్‌లను ఏదైన ప్రమాదం జరిగినప్పుడు సమయం వృధా కాకుండా బాధితులను నిర్ణీత సమయంలో (గోల్డెన్ అవర్) హాస్పటల్‌కు తీసుకువెళ్ళటంతో పాటుగా ప్రాణాపాయం నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందని నామ పేర్కొన్నారు. 108అత్యవసర సేవలను మరింతగా వేగవంతం చేసేందుకు గాను ప్రజల సౌకర్యార్దం గతంలో ఎంపీ నామ అందజేసిన వైరా, మధిర పీహెచ్‌సీల్లోని రెండు అంబులెన్స్‌లను 108 అత్యవసర సేవల విభాగానికి బదిలీ చేశారు. ఇందుకు గాను ఎంపీ నామ వైద్యారోగ్య శాఖకు చెందిన రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులతోపాటు ఖమ్మం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఆ రెండు అంబులెన్స్‌లను ప్రజల సౌకర్యార్దం 108కు బదిలీ చేశారు.