Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ- ఖమ్మం
నీట్ పరీక్షని వ్యతిరేకించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జమ్మి అశోక్ డిమాండ్ చేశారు. మెడికల్ ప్రవేశ పరీక్షల్లో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తు బుధవారం గట్టయ్య సెంటర్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జమ్మి అశోక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నీట్ ప్రవేశ పరీక్ష పేపర్లు కేంద్ర మంత్రుల పిల్లలు, వారి బంధువుల పిల్లల కోసం పరీక్ష కంటే ముందే బయటకు తీసుకువస్తారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన విద్యా విధానాన్ని తీసుకురావడం అంటే బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్యను దూరం చేయడమేనని అన్నారు. నీట్ పరీక్ష లో ఓబిసి కోట 27శాతం, ఈడబ్ల్యూఎస్ 10శాతం రిజర్వేషన్ల మీద స్పష్టత ఇవ్వకుండా కౌన్సిలింగ్ నిర్వహించకూడదని, రాష్ట్రాల హక్కులను హరించే విధంగా ఉన్న నీట్ పరీక్షను రద్దు చేయాలని, నీటి పరీక్షలలో జరుగుతున్న పేపర్ లీకేజీని నియంత్రించాలని, ప్రభుత్వ కాలేజీలో విద్యార్థులకు ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు మెడికల్ విద్యను అధిక, ఫీజులు డొనేషన్ల ద్వారా దూరం చేసే నీటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మధు, జిల్లా నాయకులు ప్రవీణ్, సంగీత, స్నేహ, మాధవి, దుర్గ తదితరులు పాల్గొన్నారు.