Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చావా దుర్గాభవాని
నవతెలంగాణ- నేలకొండపల్లి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు బాగా పెరిగిన నేపథ్యంలో ఉన్న ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తే సమస్య తీరదని తక్షణమే తాత్కాలిక ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉపాధ్యక్షురాలు చావా దుర్గ భవాని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని స్థానిక ఎన్ఏసి సెంటర్ నందు టీఎస్ యుటిఎఫ్ అధ్యక్షులు అచ్చ విజరు కుమార్ అధ్యక్షతన జరిగిన మండల మహాసభలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంఘం జెండాను యుటిఎఫ్ జిల్లా నాయకులు నెల్లూరి వీరబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలని, పాఠశాలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పాఠశాల పరిశుభ్రతపై ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు. దీనికోసం ప్రతి పాఠశాలకు స్వచ్ఛ కార్మికులను ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు బాధ్యతలు అప్పగించడం వలన క్షేత్రస్థాయిలో ఆశించిన విధంగా పారిశుద్ధ్య పనులు జరగడం లేదన్నారు. జోనల్ విధానం, లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ నిమిత్తం రాష్ట్రపతి ఆమోదం లభించినందున విద్యాశాఖ వెంటనే సర్వీసు నిబంధనలు రూపొందించి అన్ని స్థాయిల్లో పదోన్నతులు, బదిలీలు పూర్తి చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరవు డిమాండ్ చేశారు. అనంతరం టీఎస్ యుటిఎఫ్ మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా విజరు కుమార్, అయినాల గోవిందరావు, ఉపాధ్యక్షులుగా వై శంకర్రావు, ఏ సుమతి, కోశాధికారిగా నాగార్జున, కార్యదర్శులుగా పీ గురవయ్య, ఎన్ కవిత రాణి, ఎస్కే నవాబ్ సాహెబ్, పెంటి రామారావు, ఎం వెంకటేశ్వర్లు, ఆడిటర్‌గా బి.శ్రీనివాస రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో టీఎస్ యుటిఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి పి సురేష్, సీనియర్ నాయకులు నెల్లూరి వీరబాబు, రావెళ్ల అరవింద్ కుమార్, వల్లంచెట్ల భాస్కర్ రావు, రాంబాబు, నాగార్జున, రామారావు, సుమతి, మైత్రి పాల్గొన్నారు.