Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని
నవతెలంగాణ- ఖమ్మం
కేంద్ర ప్రభుత్వం దేశాన్ని కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు విమర్శించారు. బుధవారం కొలిపాక ఫంక్షన్ హాల్లో ఖానాపురం హవేలి సిపిఎం పార్టీ నాయకులు అమరాబోయిన అంజలి, తమ్మినేని వెంకటేశ్వరావు, సత్తెనపల్లి శ్రీను అధ్యక్షతన మహాసభ జరిగింది. ఈ సభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును, రైతుల పోరాటంపై జరుగుతున్న దాడులను ఖండించారు. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ది తెచ్చుకొని ప్రజా సమస్యలు పట్టించుకొని పనిచేయాలన్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్, మాచర్ల భారతి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుగ్గవీటి సరళ, కళ్యాణం వెంకటేశ్వరావు, జిల్లా నాయకులు వై విక్రమ్, జబ్బార్, బి పద్మ, మాల్సుర్, ఎర్ర శ్రీనివాస్, విష్ణు, మండల కార్యదర్శులు యస్ నవీనరెడ్డి, భూక్యా శ్రీనివాస్, సుదర్శన్రావు, ఉపేందర్, నాయకులు ఎస్.కే మీరా, పిన్నింటి రమ్య, ఎం.గోపాల్, ముదాం శ్రీనువాసరావు, పి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.