Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్
- పాల్వంచ పట్టణ నూతన కమిటీ ఎన్నిక
- అధ్యక్ష కార్యదర్శులుగా ఉదరు కుమార్, హరికృష్ణ
నవతెలంగాణ-పాల్వంచ
నాయీ బ్రాహ్మణులు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారని వారందరికీ ప్రభుత్వం రుణాలు అందజేసి ఆదుకోవాలని నాయీబ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు తూముల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పాల్వంచలో నాయీ బ్రాహ్మణ సేవా సంఘం జనరల్ బాడీ సమావేశం జిల్లా గౌరవ అధ్యక్షులు కొమురవెల్లి రవీందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలు అభివృద్ధిలోకి వచ్చి నాయీ బ్రాహ్మణులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఉచిత కరెంటు ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. నాయీ బ్రాహ్మణులకు కుల వృత్తి పేటెంట్ హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. బ్యూటీ సెలూన్ లో పెట్టుకోవడానికి ఒక్కొక్కరికి పది లక్షలు ఇవ్వాలని ఆయన కోరారు. అనంతరం పాల్వంచ పట్టణం నాయీ బ్రాహ్మణ సేవా సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కొమురవెల్లి రవీందర్ అధ్యక్షులుగా శ్రీరాముల ఉదరు కుమార్, జనరల్ సెక్రెటరీగా హరికృష్ణ, ఉపాధ్యక్షులుగా కన్నీటి శ్రీనివాస,్ తుప్పర్ల పుల్లారావు, చందర్లపాడు రామారావు, తూముల ఏడుకొండలు, కోశాధికారి సోముల పెళ్లి బాలకష్ణ సహాయ కార్యదర్శులు పెళ్లి సాయి కుమార్ రాజు, కొలిపాక భాస్కర్, సోమనపల్లి శ్రీనివాస్, ప్రచార కార్యదర్శులుగా సింగారపు శ్రీనివాస్, రాచకొండ అశోక్, అనపర్తి ప్రసాద్, గజ్జల నాగేంద్రం, ఆర్గనైజర్‌గా శ్రీపతి కృష్ణ, చంద్రగిరి తేజ సాయి కుమార్, దేవరకొండ కుమార్, గౌరవ సలహాదారులుగా ముత్యాల రాజేశం, దేవరకొండ శ్రీనివాసరావు, చందర్లపాడు సురేష్, సమ్మెట కొమురయ్య, శ్రీరాములు, ఉపేందర్, జంపాల రమేష్, మణి కుమార్‌తో పాటు పది మంది సభ్యులను ఎన్నుకున్నారు.