Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సహ చట్టంతో వెలుగులోకి..
- కర్రాలపాడులో అవినీతి బాగోతం
నవతెలంగాణ-పెనుబల్లి
రెండున్నరేళ్లుగా కర్రాలపాడు గ్రామపంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగు చూపిన అక్రమాలు పంచాయతీ భవిష్యత్తు అభివృద్ధిపై గొడ్డలిపెట్టుగా మారనున్నాయి. తాను దళిత సర్పంచినని అందువల్లే తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని సానుభూతి వ్యక్తం చేస్తున్న సర్పంచ్, తన పంచాయతీలో ఐదుగురు వార్డు సభ్యులు ఎస్సి, ఎస్టి వారు ఇటీవల జరిగిన ఉప సర్పంచి ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా ఓటు వేసి వారి నిజాయితీని నిరూపించుకోవడం పట్ల సర్పంచ్ దీనికి సమాధానం ఏంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
ప్రతి వార్డు సభ్యులు ముక్తకంఠంతో లక్షలాది రూపాయలు తప్పుడు బిల్లులు పొంతనలేని లెక్కలతో లూటీ జరిగిందని సోషల్ మీడియా సాక్షిగా వ్యాఖ్యానిస్తున్నారు. గ్రామ పంచాయతీ జరిగిన ప్రతి పనికి సంబంధించిన వోచర్ పై పని చేసిన వ్యక్తి సంతకం చేసి సంబంధిత పంచాయతీ కార్యదర్శి తన రికార్డు ద్వారా ఎంపీడీవో కార్యాలయానికి సమర్పించాలి. కార్యాలయ సిబ్బంది పంచాయతీ తాలూకా వచ్చిన బిల్లులపై చెక్కుల రూపంలో నిధులు డ్రా చేసుకునేందుకు సర్పంచి, ఉపసర్పంచి సంతకాలతో అవకాశం కల్పిస్తారు. కానీ కరాలపాడు పంచాయతీలో నిధులు డ్రా చేసే వ్యవహారంలో తప్పుడు బిల్లులు అనడానికి సర్పంచ్ ఇచ్చిన కొట్టివేత బిల్లులే ఇందుకు నిదర్శనం. లింగగూడెం గ్రామపంచాయతీ తాలుక ఇచ్చిన బిల్లును లింగగూడెం అనే పదాన్ని కొట్టి వేసి కర్రాలపాడు అని రాశారు. దీనిని సంబంధిత అధికారులు పరిశీలించకుండానే నిధులు డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వీధిలైట్లు, పైపులైను లీకేజి లు, పారిశుధ్య పనులు, అంతర్గత రహదారులు అభివృద్ధి వంటి పనుల రెట్టింపు బిల్లుల డ్రా చేసుకునెందుకు సంబంధిత శాఖ అవకాశం కల్పించడంపై అధికారులు పాత్రను సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన పత్రాలు తేటతెల్లం చేస్తున్నాయి. పంచాయతీ వార్డు సభ్యులు, ఉప సర్పంచి గ్రామపంచాయతీలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని జిల్లా పంచాయతీ అధికారులను పదే పదే కోరుతున్న పండగ , పబ్బం అంటూ కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టి పక్కదారి పట్టిన నిధులను పంచాయతీ అభివృద్ధికి దోహదపడేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని పాలకవర్గం కోరుకుంటుంది.