Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయ గర్జన సభకు పదివేల మంది కార్యకర్తలతో తరలి వెళ్లాలి
- నియోజకవర్గ స్థాయి సర్వసభ్య సమావేశంలో -ఎమ్మెల్యే వనమా
నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే దిక్సూచిగా ఉన్నాయని, విజయ గర్జన సభకు పదివేల మంది కార్యకర్తలతో తరలి రావాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం కొత్తగూడెం నియోజకవర్గ స్థాయి సర్వసభ్య సమావేశం కొత్తగూడెం క్లబ్లో జరిగింది. ఈ సందర్భంగా వనమా వెంకటేశ్వరరావు మాట్లాడారు. ప్రతిపక్షాల తాటాకు చప్పుళ్ళకు భయపడేదిలేదని, రాష్ట్రంలో, నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో దేశంలోనే అన్ని రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం ముందుందని అన్నారు, నా తుది శ్వాస వరకు నా జీవితం ప్రజాసేవకే అంకితమన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు వనమా రాఘవేందర్, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కోత్వలా శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, జెడ్పీటీసీ బరపాటి వాసు, ఎంపిపిలు, టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకురాళ్లు, పట్టణ, మండల కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, పాల్గొన్నారు.