Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైభవాన్ని చాటిచెప్పే విధంగా మహా గర్జన
- టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్
- హాజరై జడ్పీ చైర్మన్లు కోరం, బిందు
నవతెలంగాణ-ఇల్లందు
మరో రెండేళ్లు అభివృద్ధిపైనే దృష్టి పెడతానని ఎమ్మెల్యే హరిప్రియ హరి సింగ్ అన్నారు. స్థానిక మార్కెట్ యార్డులో బుధవారం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందన్నారు. ప్రతి ఇంటికి ఒక పథకం చేరువయ్యిందని అన్నారు. వరంగల్లో నవంబర్ 15న తెలంగాణ వైభవాన్ని చాటిచెప్పే విధంగా మహా గర్జన నిర్వహించనున్నామని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం , మహబూబాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ లు కోరం కనకయ్య, బిందు, మార్కెట్ కమిటీ, మున్సిపాల్టీ ,గ్రంథాలయ సంస్థ చైర్మన్ లు హరిసింగ్ నాయక్, దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, దిండిగాల రాజేందర్,ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, జడ్పిటిసి ఉమాదేవి మాట్లాడారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ పాలకవర్గం, వివిధ గ్రామాల సర్పంచులు , ఎంపిటిసిలు, నియోజకవర్గంలోని సింగిల్ విండో చైర్మన్లు, రైతు సమన్వయ కమిటీ సభ్యులు, డైరెక్టర్లు, ఇల్లందు పట్టణ, మండలాల సమన్వయ కమిటీ సభ్యులు, మహిళా కమిటీలు, మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.