Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
చిరుధాన్యాలతో ఆహారం తయారు చేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని టేకులపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో కె.మంగతార అన్నారు. బుధవారం ఆళ్ళపల్లి అంగన్వాడీ ప్రాజెక్టు పరిధిలోని రాయిపాడు గ్రామంలో చిరు ధాన్యాల ఆహార పండుగ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంగతార మాట్లాడారు. రాగి జావ, రాగి లడ్డు, రాగి పకోడీ, కొర్ర కిచిడి, కొర్ర పెరుగన్నం, కొర్ర పులిహౌర, సామ పాయసం, జొన్న ఉప్మా, రాగి రొట్టె, రాగి జొన్న రొట్టెలను, తదితర వంటలు తయారు చేసి ప్రదర్శనకు ఉంచారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజల ఆరోగ్యాన్ని దృష్ట్టిిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో రాయిపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ వూకె ఈశ్వరి, ఏసీడీపీవో అరుణకుమారి, సూపర్ వైజర్లు సుమతి, సక్కుబాయి, అనురాధ, టీచర్ నాగేందర్ పాల్గొన్నారు.