Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములకలపల్లి
మండల కేంద్రమైన ములకల పల్లిలో గుడ్ షప్పర్డ్ కాన్వెంట్లో బుధవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమా నికి హాజరైన న్యాయవాది శాంతకుమారి మాట్లాడుతూ అంతర్జాతీయ బాలికల దినోత్సవ ప్రాముఖ్యతను వివరించడంతో పాటు చట్టాల పట్ల బాలికలు అవగాహన కలిగి ఉండాలన్నారు . చట్టాలు , హక్కులపై అవగాహన కలిగినప్పుడే సమస్యను పరిష్కరించడం సులభమవుతుందన్నారు . ఆధునిక సమాజంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో వాటి వల్ల కలిగే లాభనష్టాలపై అవగాహన కల్పించారు . యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం పాఠశాలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాదర్ గోవా శౌరి, రామ్మూర్తి, సిస్టర్లు నిర్మల, దీప్తి, సుగంధి రాణి, తల్లిదండ్రులు పాల్గొన్నారు.