Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వివేక్ రామ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కార్యక్రమంలో బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా తగ్గిపోయిందనే భ్రమలో ప్రజలు వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. ప్రజలు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ తిరుమలేష్, ఎంపీఓ సునీల్ శర్మ, డాక్టర్ స్పందన పాల్గొన్నారు.