Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ యుటిఎఫ్ జిల్లా కోశాధికారి రాంబాబు
నవతెలంగాణ- బోనకల్
విద్యలో అంతరాలను పెంచే యన్‌ఈపీ 2020 అమలను వెంటనే నిలిపివేయాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కోశాధికారి వల్లం కొండా రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మండల కేంద్రంలో టీఎస్ యుటిఎఫ్ మండల స్థాయి విస్తృత సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ 1న ఎస్టిఎఫ్ఐ పిలుపుమేరకు టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో జరిగే అఖిలభారత నిరసన దినం విజయవంతం చేయాలని ఆయన కోరారు. సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్దరించాలని, పెట్రోలియం ఉత్పత్తుల ధరలను నియం త్రించాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, గెస్ట్, పార్ట్ టైం తదితర తాత్కాలిక ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్‌తో మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలను ఆదు కోవాలని, దేశవ్యాప్తంగా పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనను ప్రారంభించాలని తదితర డిమాండ్లతో దేశవ్యాప్తంగా నవంబర్ 1న ఆల్ ఇండియా ప్రొటెస్ట్ డే నిర్వహించాలని ఎస్టిఎఫ్ఐ కేంద్ర కార్యవర్గం పిలుపునిచ్చిందని తెలిపారు. ఆమేరకు ఎస్ టిఎఫ్ఐ అనుబంధ సంఘంగా టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలక్టరేట్ల వద్ద నవంబర్ 1 సాయంత్రం 4.00 గంటలకు నిరసన తెలిపి అనంతరం జిల్లా కలెక్టర్ ద్వారా భారత రాష్ట్రపతికి మెమోరాండమ్ పంపించాలని తెలిపారు.ఈ నిరసన ప్రదర్శనల్లో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు కంభం రమేష్, మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ, మండల ఉపాధ్యక్షు రాలు పి.సుశీల, ఉపాధ్యక్షులు యం.సి. చంద్రప్రసాద్, పి.పుల్లారావు, పి.గోపాల్ రావు, బి.ప్రీతమ్, ఏ.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మూడు కాంప్లెక్స్ పరిధిలోని టీఎస్ యుటిఎఫ్ కన్వీనింగ్ కమిటీల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కలకోట కాంప్లెక్స్ యన్. సైదారావు, కె.నాగలక్శి, వి.మురళి ఎన్నికయ్యారు. బోనకల్ కాంప్లెక్స్బి .ప్రీతమ్, పి.గోపాల్‌రావు, టి.లక్ష్మి ఎన్నికయ్యారు. జానకీపురం కాంప్లెక్స జి.శ్రీనివాస్, యం.నారాయణ రావు, వి నాగమణి ఎన్నికైనట్లు వారు తెలిపారు.