Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువకునికి చెడిపోయిన రెండు కిడ్నీలు
- ఆపరేషన్‌కు రూ.12 లక్షలు అవసరం
- ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబం
నవతెలంగాణ-ముదిగొండ
చిరుమర్రి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం యడవల్లి బాబు, లక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.వారికి రెక్కల కష్టం తప్ప ఆస్తులు లేవు. నిరుపేద కుటుంబానికి చెందిన బాబు, లక్ష్మీలు కష్టపడి కుమార్తె వివాహం చేశారు. ఇద్దరు కుమారులను చదివించుకుంటూ రోజు వ్యవసాయ కూలి పనులకు వెళుతూ జీవనం సాగిపోతున్న వారి కుటుంబంలో అమావాస్య చీకట్లు కమ్ముకు న్నాయి.పెద్ద కుమారుడు సైదులు డిగ్రీ చదువుతుండగా గత సంవత్సరం అనారోగ్యానికి గురికావడంతో టెస్ట్‌లు చేయించగా రెండు కిడ్నీలు పనిచేయడం లేదని డాక్టర్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. 22సంవత్సరాల యువకుడు సైదులు చదువు అర్థాంతరంగా మానేశాడు. దీంతో కుటుంబసభ్యులు ఏం చేయాలో తోచక ఆందోళన మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. కిడ్నీల ఆపరేషన్‌కు రూ12 లక్షలరూపాయలు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పడంతో ఆ నిరుపేద కుటుంబానికి అంతా ఆర్థిక స్తోమత లేక గత సంవత్సరం నుండి ప్రతి వారానికి మూడు రోజుల చొప్పున సైదులుకు డయాలసిస్ చేయించుకుంటూ గడుపుతున్నారు. ఇల్లు గడవడమే కష్టంగా ఉన్నా ఆ కుటుంబంలో రెండో కుమారుడు కూడా చదువు మానేసి మార్కెట్లోకి పనికి వెళుతున్నాడు. రోజులు గడుస్తున్న కొద్దీ సైదులు ఆరోగ్యం క్షీణిస్తోందని తల్లిదండ్రులు బరువెక్కిన గుండెలతో కన్నీళ్లు పర్వతమయ్యారు. చేతికందిన కొడుకు చేయిజారి పోతుంటే ఆ తల్లిదండ్రుల బాధ అంతాఇంతా కాదు. ఆపన్నహస్తం కోసం తల్లిదండ్రులు, యువకుడు సైదులు ఎదురు చూస్తున్నారు. సాయం చేయదల్చిన దాతలు 70958 09155 నెంబర్‌కు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా అందజేయవచ్చును.