Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అశ్వారావుపేట
వచ్చే నెల 15 న వరంగల్ నిర్వహించబోయే తెరాస విజయ గర్జన సభను విజయవంతం చేయడానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నియోజక వర్గస్థాయి ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ మండల అధ్యక్ష్య కార్యదర్శులు, మండల స్థాయి కీలక నేతల సమావేశం నిర్వహించారు. ఇంటికో మనిషి, పంచాయతీకో వాహనం చొప్పున సభకు తరలాలని కోరారు.