Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాచలంలో అడ్డుకున్న పోలీసులు
- ఐదుగురు అరెస్టు
నవతెలంగాణ-భద్రాచలం
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం నుంచి పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న రెండు లారీలను భద్రాచలం పోలీసులు బుధవారం పట్టుకున్నారు. భద్రాచలం లోని బ్రిడ్జి సెంటర్ వద్ద పోలీసులు వాహన తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రెండు లారీల్లో 80ఆవులను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి వద్ద ఎటువంటి అనుమతి పత్రాలు లేక పోవడంతో పాటు ఆవులను లారీలో కుక్కడంతో నాలుగు ఆవులు మృతి చెందాయి. దీంతో ఆవులను పాల్వంచలోని గోశాలకు తరలించారు. ఆవులను అక్రమంగా తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని, లారీలను సీజ్ చేశారు.భద్రాచలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.