Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయ చైతన్య సదస్సులో న్యాయమూర్తి వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-ఇల్లందు
వివిధ పనులలో బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా శిక్షలు ఉంటాయనే ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పట్టణంలోని గోవింద్ సెంటర్ లో బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం ఆజాదీకా అమృత్ మహౌత్సవంలో భాగంగా న్యాయ చైతన్య సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఐదు సంవత్సరాల నుండి 14 సంవత్సరముల వరకు పిల్లలందరిని బడిలో చేర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు నర్సింగ్ శ్రీనివాస్, న్యాయవాదులు పి బాలకృష్ణ, ఎస్ డి రబ్బాని, కే ఉమామహేశ్వరరావు, సీనియర్ పారాలీగల్ వాలంటీర్ సతీష్ ఖండేల్వాల్, ఇల్లందు సీఐ బి రమేష్ ,కోర్టు కానిస్టేబుల్ విజరు, అశోక్,అనంత రాములు హై స్కూల్ హెచ్ ఎం రమేష్, మండల న్యాయ సేవ అధికార కమిటీ కోఆర్డినేటర్ మధు, పాఠశాల ఉపాధ్యాయునీలు, ఉపాధ్యాయులు విద్యార్థినీలు పాల్గొన్నారు.