Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువత అథ్లెటిక్స్ పై దృష్టి సారించాలి- ఏఎస్పీ వినీత్
- క్రీడా మైదానం ప్రారంభోత్సవంలో ఐటిడిఏ పిఓ - గౌతమ్ పోట్రు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండలంలోని దుమ్ముగూడెం ఆరోగ్య కేంద్రం పక్కనే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడా మైదానం జిల్లాలోనే టాప్ క్లాస్ స్టేడియంగా తీర్చి దిద్దుతామని ఐటిడిఏ పిఓ గౌతమ్ పోట్రు అన్నారు. బుధవారం ఆయన క్రీడా మైదానాన్ని భద్రాచలం ఏఎస్పీ వినీత్జీతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన అథ్లెటిక్స్‌లో 200 మీటర్ల ట్రాక్, షార్ట్ పట్, జావెలింగ్‌త్రో , లాంగ్ జంప్, హైజంప్‌తో పాటు జిమ్నాస్టిక్‌లో పేర్లర్, పుల్ ఆప్స్, క్రీడల కోసం ఏర్పాటు చేసిన క్రికెట్ క్రీడా మైదానాన్ని పరీశీలించారు. ఈ సందర్బంగా ఆయన స్టేడియంలో రివిట్ మెంట్ , గ్రావెల్ తో స్టేడియాన్ని తీర్చి దిద్దాలని స్పోర్ట్స్ స్కూల్స్ కోచ్ వీరునాయక్ ను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుమ్ముగూడెం పబ్లిక్ స్టేడియం పలువురికి ఆదర్శంగా నిలవాలన్నారు. జిల్లాలో కిన్నెరసాని, కాచనపల్లిలో స్పోర్ట్స్ స్కూల్స్‌ను అన్ని వసతులతో నిర్మించడం జరిగిందన్నారు. ఇక్కడ అన్ని రకాల క్రీడలకు కోచ్‌లు ఉంటారని అవసరమైతే వారు దుమ్ముగూడెం క్రీడా స్టేడియంకు వారానికి ఒకటి రెండు సార్లు వచ్చి ప్రత్యేక శిక్షణ ఇస్తారనితెలిపారు.
నేటి నుండి కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్లో 5, 6 తరగతులకు అడ్మిషన్లు జరుగుతున్నాయని ఈ ప్రాంత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో క్రీడా మైదానాల ఏర్పాటుకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ఏఎస్పీ వినీత్ మాట్లాడుతూ ఒక పక్క మావోస్టుల బంద్ ఉన్నప్పటికి క్రీడా స్టేడియాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ఐటిడిఏ పిఓ ప్రత్యేక చొరవతోనే క్రీడా మైదానం ఏర్పాటు చేసినటుట్టు తెలిపారు. మండలంలో ని అన్ని గ్రామ పంచాయితీల సర్పంచ్‌లు అందిస్తున్న సహకారాన్ని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. అనంతరం పిఓ, ఏఎస్పీలు క్రికెట్ ఆడి ఆటలో హవ్వా అనిపించారు. ఈ కార్యక్రమంలో సీఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు, ఎస్సై రవికుమార్, వైద్యాధికారి బాలాజీ నాయక్, తో పాటు పిడిలు బి. హరికృష్ణ, నాగేశ్వరరావు, వెంకట్‌లతో పాటు మండలంలో ని ఆయా గ్రామ పంచాయితీలకు చెందిన సర్పంచ్‌లు, క్రీడా కారులు పాల్గొన్నారు.