Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తల్లాడ
తల్లాడ గ్రామసభకు అధికారులెవరు హాజరుకాకపోవడంతో గ్రామ సభకు హాజరైన వారు వాకౌట్ చేశారు. గ్రామ పంచాయతీ ఈఓ సీతారాములు, సర్పంచ్ సంధ్యారాణి మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు గుంటుపల్లి వెంకటయ్య, టిఆర్ఎస్ నాయకులు దూపాటి భద్ర రావు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ సర్పంచ్ పదవి యునానిమస్‌గా ఇస్తే 70 లక్షల రూపాయలు గ్రామాభివృద్ధికి ఇస్తామని, సర్పంచ్ మామ అయినా పొట్టే టి జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారని ఆ డబ్బులను గ్రామాభివృద్ధికి, కేటాయించాలని డిమాండ్ చేశారు. రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా డబ్బులు కేటాయించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఆ డబ్బులు గ్రామపంచాయతీ కేటాయిస్తే, గ్రామ సభలు నిర్వహించాలని, కింద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు, నూకల ప్రసాద్, జి వి ఆర్, డి శ్రీనివాస్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.