Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాలు: సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-కల్లూరు
ప్రజాస్వామ్యం విలువలు పూర్తిగా కొరవడి నేడు రాజకీయాలను డబ్బు, మతం శాసిస్తుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. ఎర్ర బోయినపల్లిలో పార్టీ 8వ మండల మహాసభ బీరవల్లి నరసింహయ్య నగర్లో గురువారం తన్నీరు కృష్ణవేణి, దోమతొటి పుల్లయ్య, మాదాల వెంకటేశ్వరరావు, ముదిగొండ అంజయ్య, అధ్యక్షవర్గంగా జరిగింది. ఈ సందర్భంగా నున్నా మాట్లాడుతూ చట్టసభల్లో ప్రజా సమస్యల గురించి ప్రస్తావించేవారు లేకపోవడం దురదృష్టకరమన్నారు. కమ్యూనిస్టు పార్టీలు ఎప్పటికీ కనుమరుగు కావని, మళ్లీ కమ్యూనిస్టు పార్టీలకు పూర్వవైభవం రాబోతుందన్నారు. ప్రజా సమస్యలు వెలికి తీసి వాటి పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. సిపిఎం మండల కార్యదర్శి తన్నీరు కృష్ణార్జునరావు గత నాలుగు సంవత్సరాలుగా చేపట్టిన కార్యక్రమాలు పై నివేదిక సభకు సమర్పించారు. తొలుత యర్ర బోయినపల్లి గ్రామంలో ప్రదర్శన నిర్వహించి మహాసభ ప్రారంభం సందర్భంగా పార్టీ జెండాను సీనియర్ నాయకులు మట్టురి భద్రయ్య ఆవిష్కరించారు.మహాసభ ప్రారంభం ముందు ఇటీవల మృతి చెందిన సిపిఎం నాయకులు, ఇతర ప్రజాప్రతినిధుల మృతికి సంతాపాన్ని ముదిగొండ అంజయ్య ప్రవేశపెట్టగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సమావేశం నివాళులర్పించింది.ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుర్రి ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు మాచర్ల భారతి, కళ్యాణం వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు మట్టూరి భద్రయ్య, తాతా భాస్కర్‌రావు, సత్తుపల్లి సిపిఎం నాయకులు పాండురంగారావు, రావుల రాజబాబు, గంప శ్రీనివాసరావు, గ్రామ నాయకులు తేగుళ్ళ బాబు, భట్టు నరసింహారావు, మండల పరిధిలోని సిపిఎం పార్టీ నాయకులు,కార్యకర్తలు ప్రజా సంఘాల నాయకులు మహా సభలకు హాజరయ్యారు.
మట్టూరి భద్రయ్యకు సన్మానం
కల్లూరు మండలంలో సీపీఎం నిర్మాణంలో తన వంతు కృషి చేసి పార్టీని బలోపేతం చేసిన మట్టురి భద్రయ్యను సీపీఎం మండల మహాసభ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు మాట్లాడుతూ మండలంలో పార్టీ నిర్మాణం కోసం భద్రయ్య ఎనలేని కృషి చేశారన్నారు. 30 ఏండ్ల పాటు సర్పంచ్‌గా పనిచేశారన్నారు. పార్టీలో కూడా డివిజన్ కార్యదర్శి తదితర పదవులు చేపట్టి పదవులకు వన్నె తెచ్చారని కొనయాడారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర్రి ప్రసాద్, సీపీఎం జిల్లా కార్యవర్గసభ్యలు మాచర్ల భారతి, కళ్యాణ వెంకటేశ్వరరావు, తాత బాస్కర్‌రావు, మండల కార్యదర్శి తన్నీరు కృష్ణార్జునరావు, మాదల వెంకటేశ్వరరావు, తన్నీరు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) మండల కార్యదర్శిగా మాదాల వెంకటేశ్వరరావు
సీపీఐ(ఎం) మండల కార్యదర్శిగా మాదాల వెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం యర్రబోయనపల్లి గ్రామంలో పార్టీ 8వ మండల మహాసభ జరిగింది. ఈ సందర్భంగా వ్యకాస రాష్ట్ర అధ్యక్షులు బుర్రి ప్రసాద్, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యలు మాచర్ల భారతి, కళ్యాణం వెంకటేశ్వరరావు, తాతా భాస్కర్‌రావు సమక్షంలో నూతన కమిటీ ఎన్నిక నిర్వహించగా మాదాల వెంకటేశ్వరరావును ప్రతిపాదించగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. మరో 13 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.