Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-ఎర్రుపాలెం
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకరంగా హుజురాబాద్ ఎన్నికలను తీసుకొని బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు ఒక్కొక్క ఓటుకు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఓట్లు కొనుగోలు చేస్తున్నారని, బిజెపి, టీఆర్ఎస్ పార్టీలు దొందూదొందేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు విమర్శించారు. భీమవరం గ్రామంలో మండల కమిటీ సభ్యులకు, శాఖా కార్యదర్శులకు, పార్టీ సభ్యులకు ఒకరోజు రాజకీయ శిక్షణా తరగతులను నిర్వహించారు. తొలుత గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం శిక్షణ తరగతులు వద్ద ప్రారంభ సూచకంగా పార్టీ సీనియర్ నాయకులు యరమల వెంకట నారాయణరెడ్డి జెండాను ఆవిష్కరించారు. రాజకీయ శిక్షణ తరగతులకు పార్టీ మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ కుల, మత, ప్రాంతీయతత్వాలకు వ్యతిరేకంగా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పోరాటాలు చేసేది ఎర్రజెండా మాత్రమేనని సభ్యులకు వివరించారు. సమావేశంలో నాయకులు గొల్ల పూడి కోటేశ్వరరావు, నల్లమోతుల హను మంతరావు, ఆంగోతు వెంకటేశ్వర్లు, షేక్ నాగుల్ మీరా, సగుర్తి సంజీవరావు,గామాసు జోగయ్య, బేతి శ్రీనివాసరావు, షేక్ లాలా, పెరుమాళ్ళ వెంకట రామయ్య, కోటి సుబ్బారెడ్డి, మేడగాని తిరుపతిరావు, నాగులవంచ వెంకటరామయ్య, కూడెల్లి నాగేశ్వరరావు, అయ్యవారిగూడెం సొసైటీ డైరెక్టర్ శ్రీహరి నారాయణ, అనుమోలు వెంకటేశ్వరరావు, షేర్ జాని, కల్పనా దత్తు, సామ్రాజ్యం, వెంకట్రావమ్మ పాల్గొన్నారు.