Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బైక్ ర్యాలీలు...రక్తదాన శిబిరాలు..
- అన్నదానాలు..పలు సేవా కార్యక్రమాలు
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడకను పురస్కరించుకొని ఖమ్మం నగరంలో అభిమానులు, కార్యకర్తలు, నాయకులు బైక్ ర్యాలీ, అన్నదానం, కేక్ కట్టింగ్, సేవా కార్యక్రమాలను నిర్వహంచారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజును పురష్కరించుకొని గురువారం క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్టింగ్ వేడుకను ఏర్పాటు చేశారు. పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో యూతవ, అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు వెయ్యి మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో అభిమానులు జయ జయ ధ్వానాల మధ్య పొంగులేటి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, టీఆర్ఎస్ వైరా మున్సిపల్ చైర్మన్ సుతకాని జైపాల్, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, ముదిగొండ జడ్పీటీసీ పసుపులేటి దుర్గా-వెంకట్, కార్పోరేటర్లు దొడ్డా నగేష్, మలీదు జగన్, ఎంపీపీ గోసు మధు, నిరంజన్‌రెడ్డి, ఆకుల మూర్తి, లింగాల రవికుమార్, పద్మజారెడ్డి, దుంపల రవి కుమార్, సర్పంచ్ పరికపల్లి శ్రీనివాస్, కిలారు మనోహర్, కోసూరి శ్రీను, కొంగర జోతిర్మయి, దుర్గ, వేములపల్లి వెంకన్న, చింతమళ్ల గురుమూర్తి, పాల్గొన్నారు.
ఖమ్మం ఎస్ఆర్ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరంను జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నల్లమల్ల వెంకటేశ్వరరావు, రాష్ట్ర మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్‌లు ప్రారంభించారు. సుమారుగా 250 మంది ఈ కార్యక్రమంలో రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తంను ప్రభుత్వాసుపత్రి బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జ్ బాలుకు అందజేశారు.
టీఆర్ఎస్ యువత ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
ఖమ్మం టీఆర్ఎస్ నగర నాయకులు ఖాజా ఆధ్వర్యంలో సుమారు 100 బైక్‌లతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
జిల్లా ప్రధాన ఆసుపత్రిలో బ్రడ్, పండ్లు పంపిణీ
జిల్లా ప్రధాన ఆసుపత్రిలో టీఆర్ఎస్ నగర నాయకులు దుంపల రవికుమార్ ఆధ్వర్యంలో పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొని గర్భిణులకు, బాలింతలకు బ్రడ్, పండ్లు పంపిణీ చేశారు.
అన్నం పౌండేషన్లో అన్నదాన కార్యక్రమం
టీఆర్ఎస్ నగర నాయకులు తాళ్లూరి రాము ఆధ్వర్యంలో అన్నం పౌండేషన్లో ఆశ్రయం పొందుతున్న వారందరికీ అన్నదాన కార్యక్రమంను ఏర్పాటు చేశారు. పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి ఈ కార్యక్రమంను పాల్గొని శరనార్ధులకు అన్నాదానం చేశారు.
మిర్చి మార్కెట్ యార్డ్‌లో పొంగులేటి జన్మదిన వేడుకలు
ఖమ్మం మిర్చియార్డులో కేవి చారి ఆధ్వర్యంలో మాజీ ఎంపీ పొంగులేటి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాణాసంచా పేల్చి కేక్ కట్‌చేసి సంబురాలు చేసుకున్నారు.
మిషన్ హాస్పిటల్లో పొంగులేటి జన్మదిన వేడుకలు
23వ డివిజన్లో నగర నాయకులు దాసరి శివ ఆధ్వర్యంలో మిషన్ హాస్పిటల్లో కేక్ కట్ చేసి వృద్ధులకు ఫ్రూట్స్, పండ్లు పంపిణీ చేశారు. స్థానిక అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు పలకలు, పండ్లు పంపిణీ చేశారు.
పంపింగ్ వెల్ రోడ్డు నందు పొంగులేటి పుట్టిన రోజు వేడుకలు
స్థానిక నాయకులు అర్వపల్లి శివకుమార్ ఆధ్వర్యంలో స్థానిక అమ్మ అనాదాశ్రమంలో మాజీ ఎంపీ పొంగులేటి పుట్టిన రోజును పురస్కరించుకొని కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. అనంతరం ఆశ్రయం పొందుతున్న 30 మంది వృద్దులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. స్థానికంగా నివశిస్తున్న సుమారు 300 మందికి పాల ప్యాకెట్లు, స్వీట్లు పంపిణీ చేశారు.
జీవన సంధ్యా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం
ఖమ్మం పట్టణంలోని స్థానిక జీవన సంధ్యా వృద్ధాశ్రమంలో హనుమంతరెడ్డి, జలగం రామకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 60 వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.