Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
శాంతిభద్రతలు, ప్రజారక్షణతో పాటు సామాజిక సేవలో పోలీసులు ముం దుండి ప్రజాదరణ పొందు తున్నారని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే) సందర్భంగా ట్రాఫిక్ పోలీసుల ఆధ్వ ర్యంలో పోలీస్ స్టేషన్ అవరణలో తలసేమియా చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. ఈ సంద ర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రక్తదానం మరొకరికి ప్రాణదానమని, రక్తదానంపై ప్రజలు అవగాహన పెంచుకొని స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు పోలీ సులు, ఆటోడ్రైవర్లు, విద్యార్థులు, పలువురు యువతి, యువ కులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 106 మంది రక్తదానం చేశారని అన్నారు.
పోలీస్ కమ్యూనికేషన్స్‌పై అవగాహన
పోలీస్ శాఖలో పోలీస్ వైర్లెస్ కమ్యూనికేషన్స్ పనితీరు, టెక్నాలజీ వినియోగంపై ప్రజలలో అవగాహన పెంపొందించడానికి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీసీపీ ఇంజరాపు పూజ, అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీ రామోజీ రమేష్, ఆంజనేయులు, ప్రసన్న కుమార్ , విజయబాబు, సిఐలు అంజలి, చిట్టిబాబు, కమ్యూనికేషన్స్ సిఐ కృపానీరజా పాల్గొన్నారు.