Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంఘం జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్
నవతెలంగాణ-గాంధీచౌక్
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఆవిర్భావ దినోత్సవాలు నవంబర్ 1, 2, 3 తారీకుల్లో ఖమ్మం జిల్లాలో అన్ని గ్రామ, మండల కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ గురువారం కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానిక త్రీ టౌన్ సంఘం కార్యాలయంలో సారంగి పాపారావు అధ్యక్షతన జరిగిన మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ 10 లక్షల సభ్యత్వంతో ప్రారంభమైన డివైఎఫ్ఐ గురువారంకి కోటి 70 లక్షల సభ్యత్వంతో దేశంలోనే పెద్ద సంఘంగా ఉన్నట్లు ఆయన తెలియజేశారు. యువజన వ్యతిరేక విధానాలపై పోరాటం చేసే దానికోసం, పెడదారి పడుతున్న యువతను సక్రమైన మార్గంలో పెట్టే దానికోసం డివైఎఫ్ఐ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అన్ని గ్రామ, మండల కమిటీ ఆధ్వర్యంలో జెండాలు ఆవిష్కరించి బహుముఖ కార్యక్రమాలు, సేవా సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు తదితర కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో త్రీటౌన్ కార్యదర్శి శీలం వీరబాబు, ఎర్ర నగేష్, జంగం నగేష్, ఎర్ర సాయి,మద్ది యుగేందర్, శ్రీనివాసరావు, యాకయ్య, రాజేష్, మధు తదితరులు పాల్గొన్నారు.