Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
నగరంలోని అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆశ్రమంలో ట్రాఫిక్ సీఐ అంజలి జన్మదిన వేడుకలను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పిల్లలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడారు. ఆశ్రమ పిల్లల మధ్య పుట్టినరోజు వేడుకను జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో అర్వపల్లి శివకుమార్, కిత శ్రీను, చల్ల శ్రీను, కృపాకర్ తదితరులు పాల్గొన్నారు.