Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం
నవతెలంగాణ-చండ్రుగొండ
డీసీసీి బ్యాంకులో తీసుకున్న రైతు రుణాలను రైతులు సకాలంలో చెల్లించి వడ్డీ రాయితీని పొందాలని డీసీసీ బ్యాంక్ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నారు. గురువారం అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెన సహకార సంఘం సొసైటీ పరిధిలో 65 లక్షలతో 750 మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణానికి అశ్వారావుపేట ఎమ్మెల్యే నాగేశ్వరరావు, డిసిసి బ్యాంక్ చైర్మన్ కూరాకుల నాగభూషణం పాల్గొని శంకుస్థాపన చేశారు. అనంతరం చండ్రుగొండ డిసిసి బ్యాంకులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డిసిసి బ్యాంకు రైతులకు అన్ని వేళలా అండగా ఉంటుందని. రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే వారికి వడ్డీలో రాయితీ లభిస్తుందని దీని ద్వారా రైతులకు మరిన్ని రుణాలు సకాలంలో మంజూరు అవుతాయని అన్నారు. జిల్లా సహకార సంఘం బ్యాంకు సీఈవో వీరబాబు మాట్లాడుతూ.. రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే 7 శాతం ఉన్న వడ్డీ 4 శాతమే బ్యాంకు తీసుకుంటుందని మిగతా మూడు శాతం బ్యాంకు రాయితీ ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే సకాలంలో రుణాలు చెల్లించని వారికి 14 నుంచి 15 శాతం వరకు వడ్డీ భారం పడుతుందన్నారు. మధ్యకాలిక రుణాలు ఇటీవల రైతులు తీసుకున్న ద్విచక్ర వాహనాల రుణాలు అక్కడక్కడ పెండింగ్ లో ఉన్నాయని త్వరలోనే వారందరికీ నోటీసులు జారీ చేసి రుణాల రికవరీ ప్రారంభిస్తామన్నారు. అలాగే బంగారు రుణాలపై రైతులకు పది లక్షల వరకు వడ్డీ రుణాలు మంజూరు చేస్తున్నామని ఇప్పటికే చండ్రుగొండ సహకార బ్యాంకు 5 కోట్లు మంజూరు చేశామని దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గుంపెన సొసైటీ సంఘం రైతులు తమకు సెంట్రల్ స్కీం కింద రైసు మిల్లును ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని దానిని ప్రతిపాదనలు పంపించడం జరిగిందని కేంద్రం మంజూరు చేస్తే తమ బ్యాంకు ద్వారా రెండు లేదా మూడు కోట్లు రుణం మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మిగతా సహకార సంఘం సభ్యులు రైతులు మీ బ్యాంకులో ఉన్న రుణాలను సకాలంలో చెల్లించి మీ ప్రాంతాల్లో కూడా అభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అన్నపురెడ్డిపల్లి ఎంపిపి సున్నం లలిత, జెడ్పిటిసి భారత లావణ్య రామ్, సర్పంచ్ బోడా పద్మా, ఉప సర్పంచ్ పర్సా వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, గానుగపాడు, గుంపెన, సహకార సంఘం సొసైటీ చైర్మన్లు చెవుల చందర్ రావు, బోయినపల్లి సుధాకర్, డిసి సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ నిర్మల పుల్లారావు, జిల్లా సహకార అధికారి నారపోగు వెంకటేశ్వరులు, డిసిసి బ్యాంక్ మేనేజర్ రాగమయి, సొసైటీ సీఈఓ లంక నరసింహారావు, టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.