Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతంలో నిర్మించిన పార్కులు
- ఆదరణకు నోచుకోవడం లేదు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల పరిధిలోని దుమ్ముగూడెం గ్రామ శివారులో నిర్మిస్తున్న పల్లె పకృతి పనులను గురువారం గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామ శివారులో నిత్య కోతుల సంచారం ఉందని, పార్కు నిర్మాణ పనులను ఆపి వేయాలని గ్రామస్తులు ఏక గ్రీవంగా తీర్మాణం చేసి ఎంపిడిఓ కు వినతి పత్రం అందజేశామని ఇక్కడ పనులు ఎట్టా చేపడతారంటూ గ్రామస్తులు పనుల కోసం వచ్చిన ప్రొక్లైనర్ ను తిప్పి పంపించి వేశారు. విఘ్నేశ్వర ఆలయ ఆవరణలో నిర్మించిన పల్లె పకృతి వనం సరైన పర్యవేక్షణ లేక పోవడం వలన మొక్కలు చనిపోతున్నాయని గ్రామస్తులు నిలదీశారు. కాలేజీ ఆవరణతో పాటు వర్క్ షాపు వద్ద రహదారుల వెంబడి అనూలమైన ప్రదేశాలలో పల్లె పకృతి వనాలు ఏర్పాటు చేసి వాటిని పర్యవేక్షించే విదంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పార్కు పనులు అడ్డుకున్న వారిలో బర్రి నర్సింహారావు, ఎస్కె హుస్సేన్ అహమద్, గణేష్ రెడ్డి , వెంకటేశ్వర్లు, కెల్లా శేఖర్, పెద్దాడ శ్రీను, దల్లి వేణుబాబు, సతీష్ తదితరులు ఉన్నారు.